చెన్నైలోని సత్యం థియేటర్ కాంప్లెక్స్ వద్ద సత్యం థియేటర్ ప్రతినిధి మునికన్నయ్య, సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్, గౌరవ కార్యదర్శి ఎల్. సురేశ్, వగైరా |
సినిమాకు చిరునామాగా ఉన్న చెన్నై నగరం నూరేళ్ల సినీపండుగకు ముస్తాబైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు సినిమా ఉత్సవాలతో నగరం కళకళలాడనుంది. భారతీయ సినిమా నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దక్షిణాదిలోని నాలుగు ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమల తరఫున దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ - ఎస్.ఐ.ఎఫ్.సి.సి) నేతృత్వంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినీ రంగ ఫిల్మ్ చాంబర్లు, ఆ యా సినీ రంగాల ప్రముఖులు, పెద్దలు పాలుపంచుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అండదండలందిస్తున్న ఈ కార్యక్రమానికి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియమ్ ప్రధాన వేదికగా ఈ పండుగ జరుగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం సాయంత్రం ఉత్సవాలను ప్రారంభిస్తారు. నగరంలోని ప్రధాన కూడళ్ళు, పార్కులు ఇప్పటికే ఈ ఉత్సవ ప్రకటనలు, హోర్డింగులు, తోరణాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నగరంలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో సెప్టెంబర్ 16 నుంచి 24 దాకా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలను ప్రజలకు ఉచితంగా ప్రదర్శిస్తారు. ప్రధానమైన పార్కుల్లో రోజూ సాయంత్రం పాత సినీ ఆణిముత్యాలను ప్రదర్శిస్తున్నారు. ''తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ సినీ నటి జయలలిత ఈ ఉత్సవం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ సహకారం లేనిదే ఇంత భారీ స్థాయిలో ఉత్సవాల నిర్వహణ సాధ్యమయ్యేది కాదు'' అని ఎస్.ఐ.ఎఫ్.సి.సి. అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. ''దక్షిణ భారతీయ సినిమాకు మద్రాసు జన్మస్థానం. అందుకే, ఈ నగరాన్ని వేదికగా ఎంచుకున్నాం'' అని ఆయన వివరించారు.
మరోపక్క ఈ ఉత్సవాల సన్నాహాల నిమిత్తం సెప్టెంబర్ 18 నుంచి 24 దాకా తమిళనాడుతో సహా వివిధ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లను ఆపుచేశారు. రజనీకాంత్, కమలహాసన్ సహా ప్రముఖ తారలందరూ ఈ వేడుకలో పాలొంటారు. ఇక, రెండో రోజైన సెప్టెంబర్ 22 ఆదివారం నాడు ఉదయం కన్నడ చిత్ర సీమ వేడుకలు, సాయంత్రం నుంచి తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు జరగనున్నాయి. మూడో రోజైన సెప్టెంబర్ 23 సోమవారం మలయాళ పరిశ్రమ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే, గడచిన 72 ఏళ్ళుగా సినిమాల్లో నటిస్తూ, నిన్నటితో 90వ ఏట అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఈ వేదికపై జరపనున్నారు. వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సినిమా తారలతో జరిపే సినీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.
ఇక, ఉత్సవాలు ముగిసే సెప్టెంబర్ 24 మంగళవారం నాడు నాలుగు సినీ పరిశ్రమల తాలూకు తారలతో 'గ్రాండ్ ఫైనల్' నిర్వహించనున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా, తమిళనాడు గవర్నర్ రోశయ్య, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ ముగింపు ఉత్సవానికి హాజరు కానుండడం విశేషం. ఈ తుది రోజు వేడుకల్లో దక్షిణాది భాషా తారలందరూ పెద్దయెత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ''దక్షిణ భారతీయ సినిమా వారందరూ ఒక గొడుగు కిందకు వచ్చి, ఇంత పెద్ద చేయడం విశేషం'' అని దర్శక, నిర్మాత, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఆర్. అన్నారు. ''ఈ ఉత్సవం మన జాతీయ సమైక్యత, సమగ్రతకు ఓ ఉదాహరణగా నిలుస్తుంది'' అని కె.ఆర్. అభిప్రాయపడ్డారు.

అయితే, తెలుగునాట నెలకొన్న సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ వాదాల సెగ ఈ వేడుకలను కూడా తాకింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ వేడుకలను వాయిదా వేయాలంటూ ఈ నెల మొదటి వారంలో నటుడు - నిర్మాత మోహన్‌బాబు చేసిన అభ్యర్థన కలకలం రేపింది. అన్ని రాష్ట్రాల వారూ కలసి ఎంతో ముందుగా నిర్ణయించుకొని చేస్తున్న ఈ ఉత్సవాలను ఆపడం సాధ్యం కాదంటూ నిర్వాహకులు తెగేసి చెప్పారు. దాంతో, ఉత్సవాలైతే ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతున్నాయి కానీ, అనేక ఇగో సమస్యలు, అంతర్గత విభేదాలున్న పలువురు సినీ తారలు మాత్రం వీటికి దూరంగానే ఉంటున్నట్లు ఇప్పటి దాకా అందుతున్న సమాచారం.
సినిమా ఉత్సవాల్లో అక్కినేని పుట్టినరోజు వేడుకలను కలపడాన్ని కూడా కొన్ని వర్గాల వారు వ్యతిరేకించారు. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వర్గం కూడా ఈ ఉత్సవాల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదని కృష్ణానగర్ వర్గాల కథనం. దాంతో, ఈ ఉత్సవాల్లో 22న జరిగే తెలుగు వేడుకల్లోనూ, ఆ తరువాత మన వాళ్ళలో ఎంతమంది, ఏ మేరకు పాలుపంచుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.

- రెంటాల జయదేవ
- రెంటాల జయదేవ
(Published in 'Prjasakti' daily, 21 Sept 1002, Saturday, pageNo. 8)
.........................................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment