అంబత్తూరు:
నేటి పరిస్థితుల్లో దేశభక్తిని రగిలింపజేసే 'ఎ సెయిలర్స్ స్టోరీ' లాంటి
పుస్తకాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత వుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సెయిం ట్
స్టోరీ పుస్తకం భావితరాలకు ఖచ్చితంగా మార్గదర్శకం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత నావికాదళంలో అనితర సాధ్యమైన కృషి సల్పి దేశం కోసం పాటుపడిన దివంగత వైస్
అడ్మిరల్ నీలకంఠన్ కృష్ణన్ ఆత్మకథ 'ఏ సెయిలర్స్ స్టోరీ' పుస్తకావిష్కరణ
కార్యక్రమం శనివారం రాజ్‌భవన్‌లోని అన్నపూర్ణ హాలులో జరిగింది. నీలకంఠన్ కృష్ణన్
తనయుడు అర్జున్ కృష్ణన్ పుస్తకానికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించి తన తండ్రి మృతి
చెందిన ముఫ్పై సంవత్సరాల తరువాత ప్రతిష్టాత్మకంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం
విశేషం. రాష్ట్ర గవర్నర్ రోశయ్య పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సభాధ్యక్షులు కేవీ రమణాచారి
అందుకున్నారు.
ఈ
సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. నీలకంఠన్ కృష్ణన్ భారతావనికి దక్కిన రియల్ హీరో అని
అభివర్ణించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి ప్రముఖల హయాంలో
కీలకమైన నావికాదళంలో విస్తృతమైన సేవలందించినందుకుగాను భారత ప్రభుత్వం ఆయనను
ప్రతిష్టాత్మకంగా పద్మభూషణ్‌తో గౌరవించిందని పేర్కొన్నారు. యుద్ధసమయాల్లో కృష్ణన్
వ్యవహరించిన తీరు, సమయస్ఫూర్తి నేటి తరానికి, భావి తరాలకు
ఆదర్శనీయమని కితాబిచ్చారు. అలాంటి సాహోసేపత వీరుడు తన ఆత్మకథను ముక్కుసూటిగా
ప్రస్తావిస్తూనే మధ్య మధ్యలో తనలోని రచయితని తట్టిలేపిన విధానం చాలా బాగుందన్నారు.
ఆయన
చనిపోయిన మూడు దశాబ్ధాల తరువాత ఆయన కుమారుడు పుస్తకాన్ని విడుదల చేయడం నిజంగా
ప్రశంసనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, సాంస్కృతిక
కౌన్సిల్ ఛైర్మన్ ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ.. 'ఏ సెయిలర్స్
స్టోరీ'
అద్భుతమైన
పుస్తకమని పేర్కొన్నారు. ఈ పుస్తకం కచ్చితంగా భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణన్ సేవలను గుర్తు చేసుకొని భారతావని కోసం ఆయనలాగే
శ్రమించే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుడు
రెంటాల జయదేవ మాట్లాడుతూ.. ఏ సెయిలర్స్ స్టోరీ పుస్తకం ఆద్యంతం చదివించేలా వుందని
కితాబిచ్చారు.
గత
నాలుగు రోజులుగా భారత్-పాక్ సరిహద్దులో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో
జాతిభక్తిని మేల్కోలిపే విధంగా ' సెయిలర్స్ స్టోరీ' లాంటి
పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన
కేవీ రమణాచారి మాట్లాడుతూ.. తమిళనాడు రాజ్‌భవన్‌లో తెలుగు పలుకులు విన్పిస్తుండడం
చెవులకు ఇంపుగా వుందన్నారు. రాష్ట్ర గవర్నర్ రోశయ్య వల్లే ఇది సాధ్యపడిందని
అభిప్రాయపడ్డారు. తమిళుడైన అర్జున్ కృష్ణన్, తెలుగు వారితోనూ సాన్నిహిత్యాన్ని
కలిగి వున్న కారణంగా తమిళులు, తెలుగువారు ఏకమై ఆయన తండ్రి పుస్తకావిష్కరణ
కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు.
భారత
నావికాదళంలో కృష్ణన్ సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా పుస్తక
సంపాదకులు అర్జున్ కృష్ణన్ దంపతులను రోశయ్య దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని
సీనియర్ పాత్రికేయుడు భగీరథ నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత తెలుగు సమాఖ్య
అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు డాక్టర్
సుబ్బారెడ్డి, కెన్సెస్ అధినేత కె.నరసారెడ్డి, ఆస్కా సంయుక్త
కార్యదర్శి కృష్ణ, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, ఆర్యవైశ్య
ప్రముఖుడు నారాయణ గుప్తా, సినీ నిర్మాతలు సి.కల్యాణ్, కాట్రగడ్డ
ప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు.

(13 జనవరి
2013, ఆదివారం నాటి సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికల తమిళనాడు అనుబంధాల్లో ప్రచురితం)