జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, February 12, 2013

'రేడియో తరంగ'లో తెలుగు సినిమా పుట్టిన రోజు…ఇంటర్వ్యూహైదరాబాద్ నుంచి నడుస్తున్న ఇంటర్ నెట్ రేడియో అయిన 'రేడియో తరంగ' (http://telugu.tharangamedia.com) వారు తెలుగు సినిమా 82వ జన్మదినం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు. ప్రింట్, రేడియో, టీవీ జర్నలిజాల్లో విశేష అనుభవమున్న సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి నాగభూషణరావు గారు ఉన్నట్టుండి ఫోన్ చేసి, భక్త ప్రహ్లాద విశేషాలను శ్రోతలతో పంచుకోవాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో నాతో ఇంటర్వ్యూ చేయడం ఓ థ్రిల్లే. అప్పటికప్పుడు ఆ పది నిమిషాల్లో చెప్పిన సంగతులు, తెలుగు గడ్డ మీది తొలి పర్మినెంట్ సినిమా థియేటర్ అయిన విజయవాడ మారుతీ సినిమా హాలు (స్థాపితం 1921) విశేషాలు, భక్త ప్రహ్లాద కూడా అక్కడ విడుదల కావడం లాంటివన్నీ ఈ ఇంటర్వ్యూలో వచ్చాయి.

ప్రముఖ సినీ నటుడు గుండు హనుమంతరావుతో కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడించారు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్నీ, చిన్న వార్తతో సహా రేడియో తరంగ వెబ్ సైట్ లో పోస్ట్ చేసినట్లు తుర్లపాటి నాగభూషణరావు గారు ఇవాళే చెప్పారు. ఆసక్తి గల సినీ, రేడియో ప్రియుల కోసం వారి పోస్ట్ నూ, ఆ ఆడియో క్లిప్ నూ ఇక్కడ అందిస్తున్నా. విని ఆనందించండి... ఆశీర్వదించండి....


 తెలుగు సినిమా పుట్టిన రోజు


తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా 1932 ఫిబ్రవరి 6న విడుదలైన పూర్తి నిడివిగల తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద. ఈ చిత్రం విడుదల సంవత్సరం, తేదీ విషయంలో ముసురుకున్న అనుమానాలను సినీ పరిశోధకలు రెంటాల జయదేవ (మద్రాసు)గారు వివరణ ఇచ్చారు. విజయవాడ శ్రీ మారుతీ సినిమాహాలులో ఈ చిత్రం అప్పట్లో ఆడింది. ఆ సినిమాహాలుకీ ఓ ఘన చరిత్ర ఉంది. అలాగే సురభి నాటక సమాజంతో కూడా ఈ సినిమాకు అనుబంధం ఉంది. 2013 ఫిబ్రవరి ఆరున రేడియో తరంగాలో నాగ్ తుర్లపాటి నేతృత్వంలో  ప్రసారమైన ఫోకస్ షోలో రెంటాల జయదేవ, హాస్యనటులు గుండు హనుమంతరావుగారి జ్ఞాపకాలు వినండి.


ఫోకస్, వ్యూస్ అండ్ న్యూస్ అనే ఆ ప్రత్యేక కార్యక్రమం వినడానికి ఇక్కడ ఈ లింకు నొక్కండి...

1 వ్యాఖ్యలు:

Vinay Datta said...

Congratulations! When celebrations?

madhui.