జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 13, 2010

'మేస్త్రి' ని ఏమైనా అనచ్చు కానీ, 'మగధీర' మీద మాట్లాడకూడదా!?

సినీ రంగంలో, అభిమానుల్లో ఓ వైపరీత్యం ఉంది. ఏ చిన్న విమర్శ వచ్చినా ఎవరూ తట్టుకోరు. కువిమర్శ చేస్తే సరే కానీ, సద్విమర్శ చేసినా అది పరిస్థితి. ‘నంది’లో మోసం జరిగిందా..? ‘మగధీర’లో నటన ఉత్తమమైనదేనా..? అని రాసిన పోస్టు మీద కొందరు నా మీద కోపం చూపారు. దాసరి చేసిన (చేశారనే మనవాళ్ళ అభిప్రాయం) పైరవీ గురించే మాట్లాడాలి కానీ, ‘మగధీర’ గురించి కూడా మాట్లాడడమేమిటని కొందరు అన్నారు. ఇంకొందరు వ్యాఖ్యలు రాశారు. వారికి సుదీర్ఘ వివరణగానే ఈ తాజా టపా.

నా మటుకు నేను మునుపటి టపా రాయడానికి ఓ కారణం ఉంది. ఆ ఉత్తమ నటుడి అవార్డు దాసరికి ఇవ్వడం సరైనదా, కాదా అన్నది ఒక అంశం. దానికి తోడు 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన సైతం అందుకు అర్హంగా ఉన్నదా, లేదా అన్నది మరో అంశం. ఈ రెండు అంశాలూ తాజాగా జనం ఎదుట చర్చకు నిలవాల్సినవే. అలా కాకుండా వాటిలో ఎంతసేపూ ఒకదాన్నే పట్టుకొని మాట్లాడడం సరైనది కాదు.

అందరూ నాణానికి ఒకవైపే చూస్తూ, 'మేస్త్రీ' సినిమా గురించే ప్రస్తావిస్తుండడంతో, నాణానికి రెండో వైపు దృష్టి సారించేలా చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం. నన్నడిగితే, ఇలాంటి అవార్డుల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉంటుందన్నది జనానికి తెలియనిది కాదు. అంతమాత్రాన ఈ అంశాలను చర్చకు పెట్టడమే నేరం, ఇది చిరంజీవినీ, ఆయన కుటుంబాన్నీ లక్ష్యంగా చేసుకోవడమే అనుకుంటే శుద్ధ పొరపాటు.

ఇక, కొందరేమో, అసలు సంగతి వదిలేసి, చిరు ఒళ్ళు తగ్గడమనే అంశంపైన దృష్టి పెట్టారు. నా టపాలో లేని అర్థాలు వెతికారు. లైపో సక్షన్ అంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించు (తొలగించు) కోవడమనే నాకు తెలిసిన అర్థం. కొవ్వు కరిగించుకోవడమని రాస్తే, రాతలో లేని అహంకారమనే అర్థం తీసుకుంటే, అది చదువుతున్న వారి ఆలోచనే తప్ప, రాతలో ఉన్నది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం ఎవరికీ లేదు. నాకైతే ఏ కోశానా లేదు.

దాసరి సీనియర్ నటుడు కాబట్టి, ఎలాగైనా బాగా నటించేస్తాడని మీ ఉద్దేశ్యమా అని ఇంకొందరు అన్నారు. అదే నా ఉద్దేశమైతే, మేస్త్రీ చిత్రాన్నీ, నటననూ నేను భుజానికెత్తుకోవాలిగా. ఆ పని చేయలేదే. అలాగే, నేనిక్కడ దాసరి, రామ్ చరణ్ తేజ్ ల ఇద్దరి నటననూ పోల్చడం లేదు. ఆడలేదు కాబట్టి మేస్ర్తీ చిత్రంలో నటనకు అవార్డు ఏమిటని వస్తున్న విమర్శలో ఎంత న్యాయముందో, జనం చూశారు కాబట్టి మగధీరలో నటనకు అవార్డు ఇవ్వాలన్న వాదనలోనూ అంతే న్యాయముంది. ఒకటి ఎడమ చేయి, రెండోది పుర్ర చేయి. అంతే తేడా. బ్లాగర్ బద్రి గారి కామెంట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ ‘నంది’లో మోసం జరిగిందా ? అవును. ‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ? కాదు...’’

6 వ్యాఖ్యలు:

Varunudu said...

ఉత్తమ నటనకు ప్రామాణికం ఏంటి సార్?
1) నటించిన చిత్రాల సంఖ్యా?
2) సూపర్ హిట్ సినిమాలో నటించడమా?
3) సందేశాత్మక చిత్రంలో నటించడమా?

రాం చరణ్ ఎందుకు అర్హుడు కాడు? మీరే జడ్జ్ అయితే ఎవరికి ఇస్తారు?

ఆఖరుగా.. నేను రాం చరణ్ కు గానీ, జూనియర్ యన్.టి.ఆర్ కు గానీ, మహేష్ కు గానీ ఫాన్ ను కాను. ఏది నచ్చితే అది చూస్తాను. మీరు రాం చరణ్ అర్హుడు కాదు అన్నారు..ఎందుకు కాదో తెల్సుకోవాలని ప్రయత్నం..

Anonymous said...

The value of the coin is mentioned on one side only. The other side is just a BOMMA. Bomma kante number ke viluva yekkuva. Nannadigithe iddaroo nandi ki panduley. manaki vadduley godavalu. Nijamaina kala yeppudu chacchhipoyindi. prasthutham manam choostunna cinemalu museum lo pettina mummyley. Eppudo okasari oka manchi cinema vasthundi.

Anonymous said...

అయ్యా వరుణుడు గారు,
ఉత్తమ నటనకు ప్రామాణికం ఏమిటని ఆ సంబంధం లేని ప్రశ్నలేంటండి? ఉత్తమ నటన అంటే చాలా బాగా నటించడం. ఎన్ని చిత్రాల్లో నటించినా, సూపర్ హిట్ సినిమా అయినా, సందేశాత్మక సినిమా అయినా ఆ నటుడి నటనా పటిమ, స్థాయి బాగుండాలి. అదే ఉత్తమ నటనకి ప్రామాణికం.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఈ వివాదంలో వేలు పెట్టే ఉద్దేశ్యమైతే నాకేమీ లేదు. కానీ, చెప్పాలనిపించిన కొన్ని విషయాలు :

ఇప్పుడున్నవాళ్ళల్లో చాలా వరకు "ఉత్త" నటులే. అది కూడా వారసత్వంగా పూసుకున్నవాళ్ళే కానీ, నటన అంటే ఏవిధమైన అవగహాన ఏమాత్రమూ లేదు. విషయాంతరమైనా ఈ సందర్భంలో, ఈమధ్య చూసిన పాండురంగడు సినిమా ప్రస్తావించాల్సి వస్తున్నది. ఆ సినిమా మొత్తంలో నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిన నటుడు నారదుడు వేషం చేసిన ఎల్.బి.శ్రీరాం. పాత్రౌచిత్యం ఏమాత్రమూ ప్రదర్శించకుండా సాంఘిక సినిమాలో వేసే వెకిలి కమెడియన్ గా మాత్రమే నటించాడు ఆయన. ఒకప్పుడు ఆ వేషంలో నాగేశ్వరరావు, కాంతారావు ఎంతలా మెప్పించారో చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పాలంటే శోభన్ బాబు, నిన్న మొన్న నరేష్ కూడా చూపినంత పరిణతి ఈయన చూపలేదు.

ఫైట్లు, డాన్సులు చేయగలగటమే నట ప్రావీణ్యతకు గీటురాళ్ళుగా మారిపోయాయి. ప్చ్.. వీలుంటే, ఆవకాయలో ఇదివరలో నేను వ్రాసిన ఈ వ్యాసం చదవండి.

http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=287&pageNo=2

కొత్త పాళీ said...

Interesting question.
If you pick on any of these "heroes", their fans will make ugly noise about it anyway, including caste issues and so on.
I don't even know which actors had won Nandi in the recent past. But one question though - do you think any of them displayed any better acting skills than Ram Charan?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Definitely yes, kotha pali.