జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 2, 2010

'రోబో' సందడే సందడి!హమ్మయ్య. ఎలాగైతేనేం. రజనీకాంత్ - శంకర్ ల 'రోబో' సినిమా చూశా. అదీ కష్టపడి టికెట్ సంపాదించి, మరీ మొదటి రోజే రాత్రి చూశా. హాలు కౌంటర్ లోనే బాల్కనీ టికెట్ ను అక్షరాలా నాలుగు రెట్ల రేటుకు అన్యాయంగా అమ్ముతూ, ప్రేక్షకులను దోచుకుంటున్న తీరుకు ఆవేదనపడుతూ మరీ చూశా. రజనీకాంత్ కు తెలుగులో కూడా ఉన్న అభిమానుల క్రేజును హాలులో ఆనంద పడుతూ చూశా. తెలుగులోనూ ఇలాంటి విజువల్ వండర్స్ చేసే దర్శకులు ఒకరికి నలుగురు వస్తే బాగుండునే అని ఆశిస్తూ చూశా.

పొద్దు పోయాక ఇంటికి వస్తూ, బోలెడన్ని హాళ్ళలో ఏకకాలంలో విడుదలైన 'రోబో' (తమిళంలో 'యంతిరన్') దెబ్బకు రోడ్ల మీద ఆగిపోయిన వాహనాలనూ అబ్బురంగా చూశా. అంత ట్రాఫిక్ రద్దీలోనూ బస్సులో జనం తెల్లవారు జాము నుంచి ఆ సినిమా చేస్తున్న సందడి గురించే మాట్లాడుకొంటున్న అలవికాని అభిమానాన్ని ఆశ్చర్యపోతూ చూశా. వెరసి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అని అంచనాలు కడుతూ ఇంటికి వచ్చేశా.

('రోబో'- సినిమా సమీక్ష... తరువాతి టపాలో... మరికొద్దిసేపట్లో...)

1 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ said...

త్వరగా రాయండి మరి