('‘నేనేం చిన్నపిల్లనా..?’' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)
దాదాపు 50ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి. రామానాయుడు చాలా రోజుల తర్వాత నిర్మాతగా తీసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..?’. ఇప్పటి వరకు ‘గంగ పుత్రులు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాలను తీసిన పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సారి డిఫరెంట్ గా ఓ కుటుంబ కథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. 'అందాల రాక్షసి ఫేం' రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా మాజీ మిస్ ఇండియా 'తన్వి వ్యాస్' హీరోయిన్ గా పరిచయమైంది. వీరందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'నేనేం చిన్నపిల్లనా..?.
కథ విషయానికి వస్తే..:
కట్టుబాట్లు సంప్రదాయాల మధ్య పెరిగిన స్వప్నకు అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న స్వప్న ఇంట్లో పెద్దలను అతి కష్టం మీద ఒప్పించి పైచదువుల కోసం స్వీడన్ వెళ్తుంది. అక్కడ క్రిష్ పరిచయం అవుతాడు.. తనకు నచ్చినట్టు ఉండే ఆనాథ అయిన క్రిష్ ను స్వప్న ఇష్టపడుతుంది. అలా వారి ప్రేమ సాగుతున్న క్రమంలో ఓసారి తల్లిదండ్రుల 'షష్టి పూర్తి' సందర్భంగా తనతో పాటు క్రిష్ ను ఇండియాకు తీసుకువస్తుంది. అక్కడ తన కుటుంబంలోని అనుబంధాలను చూసి స్వప్న పై మరింత ఇష్టం పెంచుకుంటాడు క్రిష్. వీరి ప్రేమ విషయం స్వప్న ఇంట్లో తెలుస్తుంది. ఆ తర్వాత వారి ప్రేమ ఫలించిందా..? ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకున్నాడా..? అనేది మిగిలిన కథ..

విశ్లేషణ:.. ఒక సినిమాకి కథను ఎంచుకునేముందు థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించేంత బలమైన అంశాలు ఏమున్నాయని దర్శక, నిర్మాతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ఇలాంటి ఆత్మపరిశీలన లోపించిన కథ.. కథనాలకు రూపమే 'నేనేం చిన్న పిల్లనా ?'. అసలు ఈ టైటిల్ కు కథకు సంబంధం లేదు. హీరోయిన్ ఎక్స్ ప్రెషన్స్ కి, డైలాగ్స్ కి పొంతనే లేదు. ఏ పాత్రకూ క్యారక్టరైజేషన్ సెట్ కాలేదు. మాటలు కొత్తగా అనిపించవు, కొన్ని అర్థంకావు. కమెడియన్స్.. నవ్వించలేక నవ్వుల పాలయ్యారు. ఎల్బీ శ్రీరామ్.. బలవంతంగా ఇంగ్లీష్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసినా.. ప్రేక్షకులు నవ్వకపోగా.. అసహనానికి గురయ్యారు. ఇక దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మార్క్ సినిమాలో ఎక్కడా కనిపించదు. గత చిత్రాలతో పోల్చితే అసలు ఈయనే డైరెక్ట్ చేశాడా..? అనే సందేహం కూడా కల్గుతుంది. శత చిత్ర నిర్మాతగా ఖ్యాతి గాంచిన రామానాయుడు.. ఈ కథను ఎంచుకోవడంలో తన అనుభవానికి పనిచెప్పలేదని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఎక్కడా.. కొత్తదనం కనిపించదు. ఎమ్.ఎమ్. శ్రీలేఖ మ్యూజిక్ లో రెండు పాటలు పర్వాలేదనిపించాయి. కాకపోతే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దారుణంగా ఉంది. నటనలో రాహుల్ ఓకే అనిపించాడు. ఇతర ఆర్టిస్టులు ఎవరూ.. పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంట్లో తీరిగ్గా కూర్చుని చూసే సీరియల్స్ లో ఇంతకంటే బెటర్ కథ.. కథనాలు కన్పిస్తాయనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్: కుటుంబ కథా చిత్రంగా ఉండడం ఒక్కటే దీనిలో ప్లస్.
మైనస్ పాయింట్స్: తన్వీవ్యాస్, ఆకట్టుకోని పాత్రలు, నీరసంగా సాగే కథనం, పండని సెంటిమెంట్.
ఇక.. నేనేం చిన్న పిల్లనా అంటూ వచ్చిన ఈ చిత్రం కనీసం చిన్న పిల్లలకు కూడా నచ్చదని సినీ విమర్శకుల అభిప్రాయం.
ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5.
..................................
0 వ్యాఖ్యలు:
Post a Comment