ఇది ఇలా ఉండగా, వీధికెక్కిన ‘మా’ వ్యవహారం, తాజా ఎన్నికల గురించి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కళాకారులంతా కలసికట్టుగా ఉండకపోతే, పోయేది మన పరువే’నని వారు అభిప్రాయపడ్డారు. ‘రోషం’ బాలు, దర్శక - నటుడు డాక్టర్ ఎల్. శ్రీనాథ్, ‘మా’లో కూడా సభ్యులైన సీనియర్ నటుడు - వకీలు సి.వి.ఎల్. నరసింహారావు, ప్రదీప్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ‘మా’లో జీవిత సభ్యుడే కాక, గతంలో న్యాయ సలహాదారుగా కూడా పనిచేసిన నటుడు సి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ, ‘మా’లో అనేక అవకతవకలు అధికారికంగానే చాలాకాలంగా సాగుతున్నాయనీ, అదంతా ఇప్పుడు బయటపడుతోందని ఆరోపించారు.
మరణించిన తరువాత మౌనం పాటించడం కాకుండా, ఉండగానే అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. కేవలం సొసైటీస్ చట్టం కింద రిజిస్టరైన ‘మా’లో తీరా ఇప్పుడు యూనియన్ వర్కర్‌స తరహాలో లబ్ధి తెస్తామని మురళీ మోహన్ తదితరులు చేస్తున్న వాదన సాధ్యం కానిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘కుబుసం’ చిత్ర దర్శకుడు శ్రీనాధ్ మాట్లాడుతూ, ‘మా’లో సభ్యత్వం కేవలం కొందరి దయాధర్మంగా మారిందని ఆరోపించారు. ‘మా’ను సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, సభ్యులకు సానుకూలంగా ఉండేలా మార్చాలనీ ఆయన అన్నారు.
(Published in 'Sakshi' daily, 28th March 2015, Saturday)
..........................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment