ఆయన ఓ చరిత్ర! - బాలచందర్‌కు ప్రముఖుల Tribute
‘‘సినీ రంగంలో ఆయన కన్నా ఎంతో సీనియర్‌నైన నన్ను ఏరికోరి తన అసోసియేట్‌గా తీసుకున్నారు. నన్ను ‘తమ్ముడి లాంటి వాడు’ అనేవారు. తమిళ పత్రికలూ మా గురించి అన్నదమ్ములని ప్రస్తావిస్తూ రాసేవి. ‘భలే కోడళ్ళు’ మొదలు ‘మూణ్రామ్ ముడిచ్చు’ దాకా 16 చిత్రాలకు ఆయన దగ్గర పనిచేశా. రొటీన్‌కు భిన్నమైన చిత్రాలు చేయడం ఆయన గొప్పదనం. అందుకే, ఆయన పేరు అంతగా దేశవ్యాప్తమైంది. ఆయన గ్రేట్ లెజెండ్. మళ్ళీ అలాంటి మేధావి కానీ, అంత క్రియేటివ్ జీనియస్‌లు కానీ సినిమా రంగానికి రావడం కష్టం.’’
- ఈరంకి శర్మ, ‘చిలకమ్మ చెప్పింది’ దర్శకుడు - బాలచందర్‌కు సన్నిహితుడు
‘‘బాలచందర్‌గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు.’’- కె. రాఘవేంద్రరావు, దర్శకుడు
‘‘దక్షిణాది దిగ్గజ దర్శకుల్లో కె. బాలచందర్ ముందు వరుసలో ఉంటారు. సినీ రంగానికి తన దర్శకత్వ ప్రతిభతో కొత్త మార్గం చూపించిన - మార్గదర్శకుడు.’’- మోహన్‌బాబు, నటుడు, నిర్మాత
‘‘మధ్యతరగతి జీవిత చీకటి కోణాల్ని అద్భుతంగా తెరకెక్కించిన ఘనుడాయన.’- త్రివిక్రమ్ , దర్శకుడు, రచయిత
‘‘బాలచందర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’’- రామ్‌చరణ్, నటుడు
‘‘చిరంజీవిగారితో ‘రుద్రవీణ’లాంటి సందేశాత్మక చిత్రం చేశారు బాలచందర్. ఎందరో నటీనటుల్ని స్టార్స్ చేసిన ఘనులు.’’
- అల్లు అర్జున్, నటుడు
‘‘సినీ సీమకు ఆయనో అద్భుతం’’
- బోయపాటి శ్రీను, దర్శకుడు
‘‘బాలచందర్ గారి ‘డ్యూయట్’ చిత్రానికీ,‘గుప్పెడు మనసు’ సహా అనేక టీవీ సీరియల్స్‌కూ తెలుగులో డబ్బింగ్ రచన చేసే అదృష్టం నాకు వచ్చింది. నా పని తీరు నచ్చి, ఆయన తన ‘కల్కి’ చిత్రాన్ని తెలుగులోకి స్వీయ నిర్మాణంలో డబ్ చేస్తూ ప్రత్యేకంగా నాకప్పగించారు. అలాగే, కమలహాసన్ ‘అవ్వై షణ్ముఖి’ చిత్రం తెలుగు అనువాదం ‘భామనే సత్యభామనే’ చూసిన బాలచందర్ ఆ చిత్ర శతదినోత్సవంలో వేదికపై అందరి ఎదుటా నన్ను ప్రత్యేకంగా మెచ్చుకొన్నారు. అది నాకు అత్యుత్తమ అవార్డు. ఆయనన్నా, ఆయన సృజన అన్నా నాకు అపార గౌరవం. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు!’’

- వెన్నెలకంటి, సినీ రచయిత
(Published in 'Sakshi' daily, 24th Dec 2014)
.........................................
0 వ్యాఖ్యలు:
Post a Comment