జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, September 7, 2010

ఆకాశవాణిలో రెంటాల!

కవి -రచయిత రెంటాల గోపాలకృష్ణ తెలుగు పాఠకలోకానికి సుపరిచితులే. మొన్న సెప్టెంబర్ 5వ తేదీ ఆయన 90వ జయంతి . ఆ సందర్భంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం 'రెంటాల జీవితం - రచనలు' పేరిట ఓ ప్రసంగం ప్రసారం చేసినట్లు మునుపటి టపాలో చెప్పుకున్నాం. ఆ ప్రసంగం రికార్డింగు...ఈ దిగువన ఆడియో లింకులో....! అవధరించండి!!

8 వ్యాఖ్యలు:

Saahitya Abhimaani said...

ధన్యవాదాలు. చాలా కాలం తరువాత రెడియో వింటున్న అనుభూతి మళ్ళీ కలిగించారు.

అక్షర మోహనం said...

Many many thanks to R.Jayadev gaaru.

చందు said...

bagundi jayadev,varu mekanna badhuva?

సూర్యుడు said...

Good one, thanks for sharing.

జ్యోతి said...

సావిరహే గారు, ఈ జయదేవ్ రెంటాల గోపాలకృష్ణగారి అబ్బాయి..

http://ishtapadi.blogspot.com/2010/07/blog-post_27.html

Unknown said...

@ శివ గారూ, అక్షర మోహనం గారూ, సూర్యుడు గారూ, జ్యోతి గారూ, సావిరహే గారూ!
కృతజ్ఞతలు.
ఇప్పుడు ఎఫ్. ఎం. రేడియో ఎంత పాపులరో, మీడియమ్ వేవ్, షార్ట్ వేవ్ బ్యాండ్ల మీద ప్రసారాలను అంతకన్నా పాపులర్ గా జనం విన్న రోజులు మనం చూశాం. భక్తి రంజని నుంచి శ్రోతలు కోరిన సినిమా పాటల జనరంజని దాకా రకరకాల కార్యక్రమాలు పొద్దస్తమానం విన్నాం. చివరకు శ్రీలంక నుంచి ...ఇది శ్రీలంక బ్రాడ్ క్యాస్టింగ్ వారి ఆసియా సేవా విభాగం... అన్న ప్రకటన నుంచి, మీనాక్షీ పొన్నుదొరై ...నమస్తే అక్కయ్యా... పిలుపు దాకా అన్నీ గుర్తే. అందుకే, ఇప్పటికీ రేడియో మనకు చెరగని ఓ జ్ఞాపకం. రేడియో కార్యక్రమాలన్నా, ఆ కార్యక్రమ నిర్వాహకులన్నా ఓ ప్రత్యేక అభిమానం.

జ్యోతి said...

గోల చేసే ఎప్.ఎమ్ చానెళ్లకంటే వివిధభారతి ప్రోగ్రామ్స్ తప్పకుండా వింటాను. నాతోపాటు నా రేడియో కూడా లేచి సరాగాలాడుతుంది.

చందు said...

@ jyothi garu : avunaa !!!