‘పరమ వీర చక్ర’ సినిమా గురించి రాసిన రెండు టపాల సమీక్ష అత్యధిక శాతం మందికి నచ్చినా, ఒక బ్లాగర్ మాత్రం నా మీద విరుచుకుపడ్డారు. నాకు లేనిపోనివి అంటగడుతూ వ్యాఖ్యానించారు. నిజానికి, నా టపాలను వారు జాగ్రత్తగా చదివితే, అలా అర్థం చేసుకొనే పరిస్థితే వచ్చేది కాదు. హీరో అల్లు అర్జున్ గురించి అనలేదేం, రామ్ చరణ్ తేజ్ ను గురించి మాట్లాడలేదేం, నయాపైసా నటన లేకపోయినా గ్లామర్ తో నెట్టుకొస్తున్న నాగార్జున మాటేమిటి ---- అంటూ సదరు వ్యాఖ్య చేసిన వ్యక్తి నన్ను ప్రశ్నించారు. దీనికి నేను ఓ చిన్న వివరణ ఇవ్వదలిచాను.
ఏ సినిమా పైన అయినా (నా చిత్తశుద్ధికి లోపం లేకుండా) నిజాయతీగా రాయాలనేది నేను అనుకున్న, ఆచరిస్తున్న నియమం. ఎవరో ఒకరి వైపో, ఒక వర్గం వైపో నిలబడి మాట్లాడాల్సిన, రాయాల్సిన అవసరం నాకు లేదు. పర్సనల్ గా వెళ్ళాల్సిన పనీ అంతకన్నా లేదు. జర్నలిజంలో చెప్పే మొదటి పాఠాలు, నియమాలు అవి. వాటిని పాటించడానికే సదా నేను ప్రయత్నిస్తుంటాను. గతం నుంచి ఇప్పటి దాకా సరిగ్గా గమనిస్తే, నా రాతలు అందుకు తగ్గట్లే ఉంటాయి. అంతే తప్ప, సదరు వ్యాఖ్య చేసిన వ్యక్తి అనుకుంటున్నట్లు నాకు బాలయ్య తక్కువా కాదు, మరెవరో ఎక్కువా కాదు. ద్వేషించాల్సినంత ద్రోహం హీరో బాలకృష్ణ ఎవరికైనా (పోనీ, నా మటుకు నాకు) ఏం చేశారని. సినిమాను సినిమాగా చూసి, అందులోని లోటుపాట్లు చెప్పడమే నా ఉద్దేశం.
పైగా, హీరో, హీరోయిన్ల గురించి చెబుతున్నప్పుడు అనివార్యంగా వాళ్ళ అందచందాలు, చూపులకు వాళ్ళు ఎలా ఉన్నదీ చెప్పక తప్పదు (ముఖ్యంగా గ్లామరే ఇరుసుగా నడుస్తున్న మన చిత్రపరిశ్రమలో...). ఫలానా నటి లేదా నటుడు మునుపటి కన్నా సన్నబడి, ఆకర్షణీయంగా తయారయ్యారని అన్నప్పుడు అభిమానులుగా ఆనందిస్తున్నాం కదా. అలాంటప్పుడు శరీరాకృతిపై పట్టు తప్పినప్పుడు ఆ మాట ఎవరైనా ఎత్తి చూపితే ఆగ్రహిస్తే ఎలా. చదివిన వెంటనే కాస్తంత కటువుగా తోచినా, ఇలాంటి సతార్కికమైన విమర్శల వల్ల అవతలి వాళ్ళు జాగ్రత్తపడతారు. తరువాతి చిత్రాల్లోనైనా జాగ్రత్తపడతారు. అలాంటి లోపాలు సరిచేసుకుంటారు. దానివల్ల వాళ్ళ తదుపరి ప్రయత్నాలు బాగుంటాయి. ఏ రచనకైనా, ముఖ్యంగా విమర్శల పరమార్థం అదే. అలా కాకుండా, ఉన్నది కూడా అసలు చెప్పకూడదంటే ఎలా. అత్త తిట్టినందుకు కాదు... తోడికోడలు నవ్వినందుకు... అంటే ఇదే.
డియర్ మేరీ
3 months ago
19 వ్యాఖ్యలు:
మీరు ఒప్పుకున్నా ఒప్పుకొక పొయినా, మీ రివ్యూ వెటకారంగా వున్న మాట వాస్తవం.
మీలాంటాడొకడు సినిమా చూసాక మూడుగంటలు టైం వేస్ట్ అయ్యిందని ఏడుస్తూ, దాని విశ్లేషణ కోసం మూడు రోజులు వెచ్చించాడంట.
సినిమాను ప్రేమిస్తూ సినిమాను వెటకారం చేయడం తప్పు. నెగటివ్ గా వ్రాసినా సిరియస్ గా వ్రాయండి.
దానికింత explanation అవసరమా భయ్యా... ఇలాంటి వీరాభిమానులకోసం ఒక పోష్టు బొక్క.
అసలెప్పుడెనా నిజంగా నటించివుంటే, బాగుందో లేదో చెప్పొచ్చు. So, you statement is wrong, they are right. :)
మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం
బాలయ్య నటిస్తే, బాగా లేదనకూడదా!?"-sure anochhu..
మీ సినిమా సమీక్ష పై నాకేమి అభ్యంతరం లేదు , తెలుగు సినిమా పై నా అంచనాలు బాగా తగ్గి పోయాయి కాబట్టి ఈ సినిమా నేను ఫ్రీ గా దొరికినా చూడబోను.
కాని మీరు చెప్పిన ఈ 'గ్లామరే ఇరుసు' ( మీరు గమనించినది అని చెప్పారనుకోండి ) అన్న పదం లో మీరు ముందు టపా లో వివరించిన దాని కన్నా హాస్యం ఉంది. మీరు సదరు నటుడి కి ఆ ప్రత్యెక పాత్ర లో రాణించడాని కి ఏమి సూచన ఇచ్చినట్లు ? ఈ వయసులో అయన మీరు ఆశించిన విధం గా శరీరం మార్చుకోలేరు కాబట్టి ...అతనికి అటువంటి పాత్రలు చేసే అర్హత లేనట్లే ...కానీ ఆ రావణాసురుడు ఎట్లున్నది మనము చూసామా లేక చదివామా ??? ..NTR లాగా కనిపించలేము అని అందరూ ఒప్పుకున్నదే కదా. ఇప్పుడు బాలకృష్ణ చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు..
ఇక మీరు ఈ టపా లో వ్రాసిన 'కటి' అన్న వ్యాఖ్య చూసి అసలలాంటి పదం మీరెందుకు వ్రాసారా అని పాత పోస్టు చూడవలసి వచ్చింది ...వ్యాఖ్యాత తప్పు ఏమి లేదు, ఇది స్త్రీల గురించి మాట్లేడప్పుడు మాత్రమే వాడుక లో ఉన్నది. మీరు హీరో కోటు గురించి వ్రాసిన వ్యంగము, చూసాక ...'కటి ' కి అసలు అర్ధం ఏమిటా అని చూస్తె ... ఉదరము, తొడలు కలిపి ఉన్చేభాగము అని ఏదో ఉన్నది...అలా మీరు సమర్ధించు కోవచ్చు ..కాని అందరికి తెలిసిన భావము పెద్దగ సభ్య మైనది కాదు ..కాబట్టి అతని ఆవేశము తప్పు పట్టలేము :( ..సరిదిద్దు కోగాలరేమో చూసుకోండి ..లేదు బాలకృష్ణా శరీరం లో ఆభాగము మీకు నచ్చలేదు కాబట్టి వ్రాసా అంటే మీ ఇష్టం .
ఒక జర్నలిజం వృత్తి లో ఉన్నారు మీరు అని ఆ టపా ద్వార తెలిసినది ...మీరే సినిమా లో గ్లామరు గురించి నొక్కి వక్కానిస్తుంటే , సామాన్య జనం కూడా అలానే చూడాలి కాబట్టి నిర్మాతలని ఇంకాస్త ప్రదర్సన లో శ్రద్ద పెట్టమని మీ ఉద్దేశ్యమా ( మిమ్మల్ని నొప్పించే ఉద్దేశ్యం లేదు ..కాని మీరు చదువరులకు కొందరికి లేదా చాలామందికి నచ్చే విధము గా మాత్రమే వ్రాసారు)
మీ వ్యాసము చాలామందికి నచ్చింది అని చెప్పుకొన్నారు ..చాలావరకు వారు సినిమా చూసిన వారు కాని, చూసే వారు కాని కాదు ... మీ వ్యాసము నచ్చని వారు కూడా అంతే మంది ఉంటారు ...వారు కూడా చూసిన వారు కాకపోవచ్చు ...మీ రచనా శైలి ప్రదర్సన మాత్రమే ఉంది టపాలో..అది బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు ...నిజం గానే శైలి బాగుంది .. వ్రాయడానికి మీకొక సబ్జెక్టు కోసము మీరు వెతుక్కుంటారు ...లేదా తెలిసిన విషయం పై వ్రాస్తారు ..
అలాగే బ్లాగ్లోకం లో నచ్చని సినిమా వ్యాసము పై వ్యాఖ్యానించడం ఆత్మహత్యా సదృశం అని నేనిప్పటికే అనుభవ పూర్వకం గా తెలిసికొన్నాను :) కాబట్టి కొద్ది మందికి మాత్రమే నచ్చలేదు అని, మీరు అనుకోవద్దు ..మీ శైలి లో వ్రాయాలనుకొంటే వ్రాయండి ..నచ్చింది అని చెప్పడానికి బాలయ్యకు ఉన్నట్లే మీకూ ఉన్నారు అనుకుంటాము. పెద్దవారు తప్పుగా వ్రాస్తే మన్నించాలి.
@ డియర్ ఏ2జడ్ డ్రీమ్స్ గారూ, నమస్కారం. సినిమాను ప్రేమించడమంటే, తప్పొప్పులు చెప్పకపోవడం అని నేను అనుకోవడం లేదు. నేను సినిమా చూసిన రోజున యథార్థంగా జరిగిన విషయాలతో మిళితం చేస్తూ, సినిమా మీద నా అభిప్రాయాన్ని రాశాను. అన్ని సినిమాలకూ అన్ని రకాలుగా రాయగలమా. చెప్పండి. తీసుకున్న వస్తువు (ఇతివృత్తం) దానికి కావాల్సిన శిల్పాన్ని వెతుక్కుంటుంది. కొన్నిసార్లు రచయిత ప్రమేయం లేకుండా కూడా ఆ కెమిస్ట్రీ జరిగిపోతుంది. చదివితే హాస్యభరితంగా అనిపించినంత మాత్రాన రాతలో, రచయితలో సీరియస్ నెస్ లేదనుకోవడం అవివేకం.
సీరియస్ నెస్ ఉన్నప్పుడే ఇలాంటివి రాయగలుగుతాం. అద్భుతంగా నటించి, అదరగొట్టేసి, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోందని ఏ సినిమానైనా భుజాన వేసుకోవడానికి సీరియస్ నెస్ అక్కరలేదు. సిన్సియారిటీ లోపిస్తే చాలు. అలా టైమ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వెనకటి రోజుల నుంచి మీ లాంటి వాళ్ళు సినిమా మీద రాయడమంటే, ఏ విధంగా రాయాలో ఓ నిర్ణయంలో ఉన్నట్లున్నారు. ఆ బాటలోనే నడవండి. మీరెందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు.....
చెప్పొద్దూ, బాలయ్య బాబు మూవీ అనౌన్స్ చెయ్యగానే రకరకాల ఫన్నీ ఎస్సెమెస్సులు మొదలవుతాయి. ఇక దాసరి పైత్యం కూదా కలగలిసిన మూవీ రిలీజయ్యిందంటే....
ఉంటారు లెండి తమ హీరో గురించి అంత పిచ్చి అభిమానం(పైత్యం) ఉన్నవాళ్ళు. నేల క్లాసు వాళ్ళే అలా ఉంటారని చాలా రోజుల వరకు నా అభిప్రాయంగా ఉండేది. కానీ ఈ పైత్యానికి క్లాసుల తేడా లేదని తెలుసుకున్నాను.
నాకు మీ రివ్యూలంటే చాలా ఇష్టం. ఇండియా టుడేలో మీ రివ్యూలు దాదాపు ఏదీ మిస్ అవ్వకుండా చదివాను.(ఇంతకీ ఆ జయదేవే కదూ మీరు?:)
మంచమ్మాయి(మంచు వారి అమ్మాయి) డబ్బా కొడుతున్న ఆ ధీరుడి రివ్యూ కోసం మీనుండి ఎదురుచూస్తున్నాను.
అయ్యా, ఏ2జడ్ డ్రీమ్స్ గారూ, మీరు రాసిన, "మీలాంటాడొకడు సినిమా చూసాక మూడుగంటలు టైం వేస్ట్ అయ్యిందని ఏడుస్తూ, దాని విశ్లేషణ కోసం మూడు రోజులు వెచ్చించాడంట." వాక్యం, చాలా తర్క బద్ధంగా వుండి, నాకు ఎంతో నచ్చింది. భలే వేశారు ప్రశ్న.
అయితే, నా ప్రశ్న: మూడు గంటల టైం వేస్ట్ అయిందని ( ఈ సినిమాకి), రెంటాల జయదేవ్ గారు ఎక్కడ అన్నారూ? ఆయన పోస్టులు ( ఈ సినిమా గురించి) మూడూ చూశాను. ఎక్కడా ఆయన మూడు గంటల టైం వేస్ట్ అయిందని రాసినట్టు లేదు. మరి ఈ ప్రశ్న ఆయనకి ఎలా వర్తిస్తుందీ? జనరల్‌గా రాశానని మీరంటారా? అప్పుడు ఈ పోస్టు కింద రాయడంలో ఏం అర్థం ఉందీ?
జర్నలిస్టుగా ఒక సినిమా చూసి, దాని మీద స్వంత అభిప్రాయాలు రాయడం తప్పు కాదే! ఆ అభిప్రాయం తప్పయితే, సోదాహరణంగా చెప్పాలి. వ్యక్తిగతంగా విరుచుకు పడ్డం ఎందుకూ? అయితే, మీరన్నట్టు, ఒక సినిమా చూస్తే మూడు గంటల టైం వేస్టయిందనుకునే వాళ్ళు, ఆ సినిమా గురించి, ఎన్నో రోజులు పరిశీలనలో పడకూడదు. ఇక్కడ అలా జరిగిందని అనిపించలేదు.
సినిమాలు చూసే వాళ్ళు, ఆ సినిమాలని విమర్శించకూడదా? అదేం తర్కం? చూసిన ప్రతీ సినిమా నచ్చనక్కర్లేదు కదా? అందులోనూ సినిమా అనేది మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్న సరుకు. మనం కొనుక్కున్న సరుకు మనకి నచ్చక పోతే, ఏమన్నా (ఆ సరుకు గురించి) అనడానికి మనకి హక్కు వుంటుంది. అలాగే, ఆ సరుకు నచ్చిన వాళ్ళకి కూడా (ఆ సరుకు గురించి) ఏమన్నా చెప్పుకోవడానికి హక్కు వుంటుంది. అలా అని చెప్పి, సరుకు నచ్చిన వాడు, సరుకు నచ్చని వాడిని, "అది నచ్చలేదని అనడానికి నీకేం హక్కూ?" అన్నట్టుగా వుంటే, అందులో అర్థం ఏముందీ? అలాగే, సరుకు నచ్చని వాడు, నచ్చిన వాడిని, "నీకెలా నచ్చిందీ?" అని నిలదీయడంలో కూడా అర్థం వుండదు. ఎటొచ్చీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి చెప్పుకోవచ్చు, వ్యక్త్రిగత ప్రశక్తి లేకుండా. సినిమాలు ఎక్కువగా చూసినంతగా, దానర్థం సినిమాని ప్రేమిస్తున్నట్టు కాదు. చాలా మంది సినిమాని ఒక కాలక్షేపానికి చూస్తారు. సినిమాలో చూపించే అపసవ్యపు సన్నివేశాలని, నవ్వుతూ చూడొచ్చు. ఆ విధంగా కూడా కాలక్షేపం కానిచ్చుకోవచు. డబ్బు పెట్టుకుని కొనుక్కుంటున్నాం కాలక్షేపాన్ని. మన సరుకుని ఎలా వాడుకుంటామో, మన ఇష్టం. వ్యక్తిగత దాడులు లేకుండా, సినిమాలో మీకు నచ్చిన విషయాల గురించి మీరూ చెప్పుకోవచ్చు. అలా చెప్పకోవడానికి వీలు లేదని అనడానికి ఎవరికీ హక్కు వుండదు. అప్పుడు మీతో ఏకీభవించే వాళ్ళు ( ఆ విషయాల్లో) కొందరైనా వుంటారు. నచ్చని వాళ్ళు కూడా, ఆ విషయం వాళ్ళకి ఎందుకు నచ్చలేదో చెప్పుకోవాలి.
చర్చలన్నీ ఇలా వుంటే, ఎంత బాగుంటుందో చదవడానికి కదా?
Indian Minerva and Snkr....
Lolz!
>>మీరెందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు.....<<
మీరు ప్రశ్న అడిగారు, నాకు తోచిన సమాధానం చెప్పాను.
మీరెందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు అంటే నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే సమాధానం కోసం మీరు ఈ పోస్ట్ వేయలేదని. SORRY FOR RESPONDING FOR YOUR POST !
అయ్యా రెంటాల జయదేవ్ గారు,
నా వ్యాఖ్యకు స్పందించి ప్రత్యేక టపా వెలువరించినందుకు కృతజ్ఞతలు.'బాలయ్య నటిస్తే బాగ లేదనకూడదా' అని హెడింగ్ పెట్టారు.నిజానికి నేనన్నది వేరు,మీరు ఆపాదిస్తున్నది వేరు.బాలయ్య నటనలో అతిని గురుంచి మీరు ప్రస్తావిస్తే నాకు అభ్యంతరం లేదు.నటనపై ఎవరి అభిప్రాయాలు వారివి.కానీ నేను విమర్శించింది కటిప్రదేశం అంటూ మీరు వ్రాసినదాన్ని.బాలయ్య కటి ,అల్లు అర్జున్,రాంచరణ్‌ల అందచందాలు లోకవిదితం.వాటిని మీరు ప్రత్యేకంగా సమీక్షలలో ప్రస్తావించనక్కరలేదు.
అది వారి శరీరతత్వం.దాచినా దాగేది కాదు.ప్లాస్టిక్ సర్జరీలు,లిపోసక్షన్ లాంటివి చేయించుకోవాలన్న ఇప్పుడు బాలయ్య వయసు యాభైయేళ్ళు .మీ సూచనలు చదివి తారలు జాగ్రత్తపడే అవకాశం ఉందన్నారు.మరి అవే సూచనలు రాంచరణ్ ,అల్లు అర్జున్,నాగార్జున లాంటి వారికి చేశారా.రాంచరణ్‌ని ఆరంజ్‌లో క్లోజప్‌లో చూస్తే దడుసుకుచచ్చాం.మరి మీ రివ్యూలో ఈ విషయమై ఏ సూచనా చెయ్యలేదే.కడప యాసలో నాగార్జున చెప్పే డైలాగులకి జనం నవ్వుకున్నారు.ఇది నటనకు సంబందించిన విషయం.ఈ విషయమై మీ రగడ సమీక్ష ఎంటువంటి సెటైర్లు వెయ్యలేదే.బాలయ్య విషయంలోనే మీకు బాధ్యత గుర్తొచ్చిందా? బాలయ్య బానపొట్ట,
సన్నకాళ్ళు మీకు గుర్తొచ్చాయి గానీ మెగా హీరోల అందచందాలు మీకు ఏరోజూ గుర్తుకు రాలేదా? నిజానికి మీరు కేవలం బాలయ్య నటనని విమర్శించాలనుకుంటే రావణబ్రహ్మగా బాలయ్య తేలిపోయాడనో లేక మరోరకంగానో వ్రాసేవారు.ఇలా పొట్ట గురుంచి,కాళ్ళ గురుంచి వ్రాసేవారు కాదు.టపా చివర్లోని 'తోటి కోడలు సామెత ' మీ వ్యాసానికి బాగా వర్తిస్తుంది.
@రుషి గారు,
బాలయ్య మీద వచ్చిన ఎస్సెమ్మెస్‌లు బ్లాగుల్లో వేసుకుని ఆనందించే మీబోటి పోష్ సూడో మేధావుల కంటే నాది బెటర్ క్లాసేలే లేండి.నేను బాలయ్య అభిమానినే అయినా ఏనాడు మెగా హీరోల పై ఎస్సెమ్మెస్‌లు,మెయిల్లు ఫార్వర్డు చెయ్యలేదు.
పరమ వీరచక్ర మీద విష ప్రచారం తగదు
దాసరి నారాయణరావు వంటి గొప్ప దర్శకుని నిర్దేశకత్వంలో వచ్చిన పరమ వీర చక్ర గురించి జనం వాగుతున్న వాగుడు చూస్తుంటే చాలా బాధగా ఉంది. సినిమా గురించీ, బాల కృష్ణ గురించీ ఇంత చీప్ గా మాట్లాడాల్సిన అవసరమేముందసలు? నచ్చక పోతే చూడటం మానేయవచ్చుగా? ఎవరు చూడమన్నారు? మన గొప్ప దర్శకుల్ని మనమే గౌరవించుకోక పోతే ఇతరులెలా గౌరవిస్తారు? కాలానికి తగ్గట్టు మారటానికి అందరూ మార్టిన్ స్కోర్సెసేలో, కాలాన్ని జయించి మరీ ముందుండటానికి జేమ్స్ కా౨మెరాన్లో, క్రొత్త చెత్తని చెత్త క్రొత్త పద్ధతిలో చెప్పి జనాన్ని వెర్రి బాగుల వాళ్ళని చెయ్యటానికి క్రిస్ నోలాన్లో కాదు కదా.
ఏ సినిమా అన్నా అంచనాలకు తగ్గట్టు లేకపోతే విమర్శించినా ఒక అర్థముంది. కానీ, పరమ వీరచక్ర అంచనాల్ని మించి మరీ చెత్తన్నరగా ఉందే అలాంటప్పుడు విమర్శించాల్సిన పని ఏమిటి? :D ముహుర్తమ్మొదలు కాక మునుపు నుండే జనాలు సినిమా భవితవ్యాన్ని ఊహించారు. అంచనాలు వేశారు. వాటన్నిటినీ మించి మరీ ఉందే? మరెందుకీ బాధ? :D
అ2జ్ డ్రీంస్ వారికి నమస్కారం. సినిమా రివుయు వెటకారంగా ఉందని అనడం సమంజసంగా లేదు. ఒక రివుయుని రివుయు లాగానే చూడాలి. సినిమా ప్రేమించే వాడే సినిమాని ఉన్నది ఉన్నట్లుగా రివుయు చేయగలడు. ఒకడికి వాడి భార్యమీదగాని, బిడ్డమీదగాని ప్రేమ ఉన్నంత మాత్రన వాళ్ళ తప్పులని కప్పి ఉంచాలని లేదు. ఆలా ఛేస్తే ద్రొహం అవుతుంది. ఇలాంటి ఒక చక్కటి రివుయుని విమర్సించే "నైతిక" హక్కు యెవరికీ లేదు. కావాలంటే మీరు కూడ సినిమా చూసి రివుయు రాయండి. నిజాయితీగా మనసు పెట్టి రాయడం ఎంత కష్టమొ అర్థం అవుతుంది. జయదేవ గారు ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఐనా అ2Z లొ ఒక్క అక్షరం పొయిన మీరు ఊరుకుంటరా? ఊరుకోరు!!! మరి ఈ రివుయు అ2జ్ గా ఉన్నప్పుడు మీకు యెందుకు సార్ అంత ఉలుకు. బలక్రిష్న గాని దాసరిగాని ఈ రివుయు చదివితే చాల సంతొషిస్తారు, ఎందుకంటె వాళ్ళు వాళ్ళని ములగ చెట్లు ఎక్కించే వాళ్ళనే చూసి ఉంటారు గాని ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలుకొట్టే వాళ్ళని కాదు. నేను బలక్రిష్నని అభిమానించే వాళ్ళళొ ఒకడిని. నాకే ఈ సినిమా బలక్రిష్న చేయకుండా ఉంటె బాగుణ్ణూ అనిపించింది. బాలయ్యకి ఇంక 100 సినిమాలు పూర్తి అవలేదు. కనీసం ఈ సినిమా లొ జరిగిన తప్పుని రాబొయే సినిమాలొ చేయకుండ ఉంటారు. సిమ్హాన్ని సిమ్హం లాగనే చూపాల్సిన భాథ్యత డిరెక్టెర్ పై ఉంది, ఈ విషయంలొ దాసరి ఆట్టర్ ఫ్లౌప్ గాని బాలయ్య కాదు.
నమస్తే నమస్తే నమహ
నేను తప్పుగా మాట్లాడేమోనని మళ్ళీ మీ మునుపటి సమీక్షలు తిరగేశాను.బాలయ్య వేసిన డాన్సులని కీళ్ళవాతం నృత్యాలతో పోల్చారు మీరు.పైగా కటి ప్రదేశాన్ని కవర్చెయ్యడానికి పెద్ద కోటు తొడిగితే బుడబుక్కలవాడిలా ఉన్నారని వ్రాశారు.ఓహో ఎవరైనా హీరో కోటు తొడిగితే అది కటి ప్రదేశాన్ని కవర్చెయ్యడానికేనా? ఈ వాక్యాలను మీరు సద్విమర్శలనే అనుకుంటున్నారా? ఇది అమాయకత్వమా లేక అజ్ఞానమా? టాప్-4లో చిరు తర్వాత డాన్సులు బాగా వెయ్యగలిగిన హీరో బాలయ్య ఒక్కడే.ఈ విషయం ఎప్పుడో వచ్చిన ముద్దులమావయ్య, బాలగోపాలుడు చిత్రాల నుంచి నిన్న మొన్న వచ్చిన సింహ చిత్రాలు కూడా రుజువు చేస్తాయి.డాన్సులు బాగా వెయ్యగలిగిన బాలయ్యని ఇలా విమర్శించిన మీరు ఎక్సర్సైజులు తప్ప ఏ రోజు డాన్సు చెయ్యని నాగర్జునని ఎందుకు విమర్శించలేదు రగడ సమీక్షలో? అన్ని పాటలలో హీరోయిన్లు స్టెప్పులేస్తూంటే నాగార్జున క్యాట్‌వాక్ చేశాడు.అది మీ కళ్ళకి కనిపించలేదా? పరమవీరచక్ర నాకూ నచ్చలేదు.చెత్తగా ఉంది.ఒసేయ్ రాములమ్మ తర్వాత ఒక్క హిట్టూ లేని దాసరి దర్శకత్వంలో సినిమా అనగానే 90% శాతం ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు.కానీ మీ సమీక్షలో సినిమా మీద అక్కసు కంటే బాలయ్య మీద అక్కసే ఎక్కువ ప్రతిఫలించింది.ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ వ్రాసిన సమీక్షలా లేదు.బాలయ్య తుమ్మినా దగ్గినా చవకబారు కామెడీలు చేసుకుని నవ్వుకునే బాపతు వ్యక్తులు చాలా మంది వున్నారు లోకంలో.వారిలో ఒకరు వ్రాసిన సమీక్ష లా ఉంది.
ముహుర్తమ్మొదలు కాక మునుపు నుండే జనాలు సినిమా భవితవ్యాన్ని ఊహించారు. అంచనాలు వేశారు. వాటన్నిటినీ మించి మరీ ఉందే? .....
గీతాచార్యా,
ప్రతిఘటనలో కోట ప్రశ్న రిపీట్ చేస్తున్నాను!సినిమాని నువ్వు పొగిడావా? తిట్టావా ?:-))
తెలుగు ని సరిగ్గా పలకలేని వంశాంకురాలు,ఇంకా ఏదో సాధించాలని వయసుని మేకప్పు కింద దాచి తమ పైత్యాన్ని స్క్రీన్ మీద చూపించే మూలవిరాట్ల సినిమాలని బాగాలేకపోతే బాగాలేదు అనడానికి మేధావులవ్వక్కర్లేదు లెండి.
బాలక్రిష్ణ సినిమానే కాదు రగడ సినిమా గురించి కూడా ఇలాంటి టాకే ఉంది.
బాగాలేకపోతే బాగాలేదంటాము. కమెడియన్ అవసరాన్ని హీరో భర్తీ చేస్తే ఇంకాస్త ఎక్కువ నవ్వుకుంటాము.
బాగాలేకపోయినా కూడా తమ హీరో సినిమా కాబట్టి బాగుంది అనుకునే వారే సూడో మేధావులు.
ఇక దీనిమీద నేను వాదన పెంచదలచుకోలేదు.
A happy customer tells to 3,while an unhappy customer tells to 30
Post a Comment