జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, August 9, 2010

బెజవాడలో అభివృద్ధి అంటే ఇదేనా?!

(కళ్ళుండీ చూడలేని వారి కోసం మా బెజవాడ ఘనత -2 )

బెజవాడలో కొద్ది నెలల క్రితం ‘మెట్రో ఎక్స్ ప్రెస్’ల పేరిట కొత్త సిటీబస్సులు వేశారు. వీటిలో ఎక్కితే కనీసం 6 రూపాయల దాకా టికెట్టు. సాధారణబస్సు టికెట్ ధర కన్నా 2, 3 రూపాయల పైనే ఎక్కువ. దూరం పెరిగే కొద్దీటికెట్ రేటు, ఈ తేడా మరీ పెరిగిపోతాయి. కానీ, అది మామాలు బస్సువేగంతోనే, అదే విధంగా అన్ని స్టాపుల్లోనూ ఆగుతూ వెళుతుంది. అలా వెళ్ళేబస్సు ఎక్స్ ప్రెస్ ఎలా అవుతుంది! ఆదాయం పెంచుకోవడానికి పాలనా యంత్రాంగం,రోడ్డు రవాణా సంస్థలు చేస్తున్న రైట్ రాయల్ దోపిడీ ఇది!! వీటి గురించిప్రజా క్షేమం కోసమే ఉన్నామంటున్న పార్టీలు కానీ, పెద్దలు కానీ, అందుకోసమేకలం పట్టామంటున్న పత్రికల వాళ్ళు కానీ పెదవి విప్పరు.

సత్యనారాయణపురం రైల్వే లైను తొలగించాక, ఆ రోడ్డును చాలా వెడల్పు చేసి,ప్రత్యేక బి.ఆర్.టి.ఎస్. బస్సు మార్గంగా చేస్తున్నామన్నారు. మూడు
నాలుగేళ్ళు గడిచాక ఎలాగైతేనేం, అక్కడి మట్టి తొలగించి, కొంత మేర రోడ్డువేశారు. కానీ, పూర్తి కాకుండానే ఆ మార్గానికి తూతూ మంత్రంగాప్రారంభోత్సవం జరపాలని ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినిరప్పించారు. పూర్తవని రోడ్డులో, వెళ్ళని బస్సులకు ప్రారంభోత్సవం ఏమిటనితెలుసుకున్న మంత్రి గారు కారు దిగకుండానే కూకలేసి, ప్రారంభోత్సవంజరపకుండానే వెనక్కివెళ్ళిపోయారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటన మనబెజవాడ అభివృద్ధికి గీటురాయి కాదా!

ఇవాళ్టికీ బెజవాడలో కాలక్షేపానికి సినిమా తప్ప మరేదైనా ఉందా? కనీసం పెద్దపార్కులు కూడా లేవు. ఉన్న ఒకటి రెండింటిలో సౌకర్యాలు లేవు. గాంధీనగరంలోదుర్గా కళామందిరం పక్కన కాలువ ఒడునున్న గోరా పార్కు లాంటివి కూడాప్రభుత్వ శాఖల భవన నిర్మాణాల చేతిలో ఆక్రమణ పాలై, కుంచించుకుపోయాయి.చదువుకోవడానికి గ్రంథాలయాలు లేవు. వందేళ్ళ నాటి రామమోహన లైబ్రరీ, పాతశివాలయం భ్రమరాంబా మల్లేశ్వర స్వామి లైబ్రరీ లాంటి వాటిని గబ్బిలాలకొంపలుగా మార్చేసి, శిథిలావస్థలో వదిలేశాం. పోటీ పరీక్షల పుస్తకాలతోనిండిపోయిన ఠాగూర్ లైబ్రరీ మినహా మరో దిక్కు లేకుండా పోయింది. ఈతప్పెవరిది? మీదీ, నాదీ, మనదీ, మనం ఎన్నుకున్న పాలకులదీ కాదా? (ఇక్కడపార్టీల తేడాలేవీ లేవు. అన్నీ ఆ తాను ముక్కలే).

తాతల కాలం నాటి హనుమంతరాయ గ్రంథాలయం, రోడ్ల వెడల్పులో అగ్గిపెట్టెంత అయినరోటరీ క్లబ్ ఆడిటోరియం, ఒక్కగానొక్క తుమ్మలపల్లి వారి క్షేత్రయ్యకళాక్షేత్రం తప్ప మనకు ఓ శాశ్వత కళా, సాంస్కృతిక కేంద్రాన్నిఏర్పాటుచేసుకోగలిగామా? అయితే హాల్లో, లేదంటే టీవీలో సినిమాలు చూడడానికేతప్ప, మన సంస్కృతికీ, సాహిత్యానికీ పెద్దపీట వేసే కార్యక్రమాలకు బెజవాడనుకేంద్రంగా మలుచుకోగలిగామా? ఒకప్పుడు వెలిగిన ఆ పాత వైభవాన్ని మన చేతులతోమనమే ధ్వంసం చేయలేదా!!

విజయవాడకు ఇవాళ్టికీ సరైన విమానాశ్రయం ఉందా! లేదు కదా....!! చీకటి పడితేవిమానాలు దిగడానికి వీలుండని గన్నవరం విమానాశ్రయమే అప్పటికీ, ఇప్పటికీదిక్కు. ఇన్నేళ్ళలో దాన్ని అభివృద్ధి చేసిన నాథుడు లేడు. సమీపభవిష్యత్తులో అభివృద్ధి చేసే దాఖలాలూ లేవు. రాష్ట్రంలోని నాలుగు ముఖ్యనగరాల్లో ఒకటిగా పేరే తప్ప, ఒకప్పటితో పోలిస్తే బెజవాడ జనాభాలోనే తప్ప,
వసతుల్లో పెరిగినట్లు చెప్పలేం.

లక్షల కొద్దీ జనాభా ఉంటేనో, చుట్టుపక్కలి ఊళ్ళ కన్నా వైశాల్యంలో,వ్యాపారంలో పెద్దది అయితేనో, మౌలిక వసతులు లేకుండా విలాసాలకు విడిదిఅయితేనో నగరమని చెప్పడం ఒంటి కన్నుతో చూడడమే! బి.ఆర్.టి.ఎస్. బస్సులువచ్చేస్తున్నాయనీ, హైదరాబాద్ నుంచి బెజవాడ మార్గం నాలుగు లైన్ల మార్గంఅయిపోతోందనీ, కారులో ప్రయాణం సుఖంగా సాగిపోతుందనీ చంకలు గుద్దుకుంటేసరిపోతుందా! సామాన్యమైన జీతంతో సాధారణ జీవితం గడిపే సగటు మనిషికి రోడ్లు,నీళ్ళు లేకపోయినా, ఉన్నవాటికి డబ్బు ఎక్కువ వెచ్చించాల్సి వచ్చినా -మనకేం లెమ్మని ఊరుకుందామా?!

సోకాల్డ్ కార్పొరేషన్ పేట పెద్దల మొదలు మన వోట్లతో ఢిల్లీ దాకా ఎదిగిననోట్ల మూటలు సంపాదిస్తున్న నేతల దాకా ఎవరికీ ఇవేవీ పట్టనందుకు నిజంగా మనంగర్వించాల్సిందే! ఇన్ని లోటుపాట్లున్నా సరే, ఉష్ట్రపక్షిలా తల ఎక్కడోపెట్టుకొని, ఆకాశంలో చుక్కలు చూస్తూ, నేల మీద కాళ్ళెక్కడున్నాయోచూసుకోకుండా మైమర్చిపోవాల్సిందే! ‘మాది ఎంతో అందమైన నగరం’ అంటూ శుష్కవచనాలతో, కాలం గడపాల్సిందే! అలా నింగిచూపుల దృష్టితో చూస్తే మాత్రం -అవును ‘పెద్ద పల్లెటూరు’ బెజవాడ అతి అందమైన నగరం.

(పారిశ్రామికంగానే కాదు, ప్రజావసరాల రీత్యా కూడా అభివృద్ధికి నోచుకోక,సంస్కృతి - సాహిత్యపరంగా కూడా పాత వైభవాన్ని కూడా పోగొట్టుకుంటున్న నాపుణ్యభూమి - జన్మభూమి మీద ప్రేమతో, బాధతో........)

5 వ్యాఖ్యలు:

Afsar said...

పుట్టినిల్లు, మెట్టినిల్లు అనే మమకారం వుండడం మామూలే కానీ, అది వున్నంత మాత్రాన్న విమర్శనాత్మకంగా వుండకూడదన్న రూలేమీ లేదు. జయదేవ బెజవాడ అభివృద్ధి గురించి రాసింది అన్ని పట్టనాల/నగరాల అభివృద్ధికి అన్వయించే విషయంగా కనిపిస్తోంది నాకు.

అభివృద్ధి/ అసమాన రాజకీయాల పరస్పర సంబంధాన్ని ఇంకా చర్చించాల్సిన అవసరం వుంది. కొంచెం విస్తృత స్థాయిలో ఇది తెలంగాణా-సీమ- ఉత్తరాంధ్ర- అభివృద్ధి వెనకబాటు తనం దాకా చర్చకి వెళ్ళాలి. ఈ అభివృద్ధి రాజకీయాల పరాకాష్ట హైదరబాద్.

Unknown said...

@ అఫ్సర్ గారూ,
మీ కామెంట్లకూ, మీరిచ్చిన లోచూపుకూ కృతజ్ఞతలు. ఇక్కడ బెజవాడ ఓ ప్రతీక, ఉదాహరణ. అంతే. అభివృద్ధి, దాని పేర తెలిసో, తెలియకుండానో సాగుతున్న సంస్కృతీ విధ్వంసం దృష్టి సారించాల్సిన అంశాలు. ఈ అభివృద్ధి రాజకీయాలు లోతుగా చర్చించాల్సిన విస్తారమైన అంశం. ఆ చర్చకు ఈ పోస్టు మరోమారు పురికొల్పగలిగితే, అంతకన్నా ఇంకేం కావాలి.

Wit Real said...

bezawada is a major railway junction.

trains spend little time in their transit here.

similarly, people spend "little" time in their life's journey here.

as an educational hub, many folks from the neighboring places come here for a couple of years and then move on.

unskilled labor migrate from neighboring villages & learn some skills in the auto ancillary units & move on to more industrialized cities like Hyd

except for that, there is no "industrial" or "IT" development in this side of the world.

when there is zero industrial development, where is the question of facilities & infrastructure?

and when there is zero development, the existing facilities will naturally deteriorate.

thats what happening there.

yawn....

Wit Real said...

btw, బెజవాడ అంటే బాబాయి హోటల్ గుర్తొస్తుందికానీ, ఈ కరీం హోటలేంది గురు?

Anonymous said...
This comment has been removed by the author.