మీరు ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా తలనొప్పితో తిరిగొస్తున్నారా.? ఏదీ మీకు తగినంతగా వినోదం పంచడం లేదని బాధపడుతున్నారా? తెలుగు సినిమాల మీద కచ్చితమైన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నారా? అయితే, మీరు అర్జెంటుగా ‘పరమ వీర చక్ర’ సినిమా చూడాల్సిందే. సరైన స్నేహితులతో కలసి ఈ సినిమాకు వెళ్ళండి. మీకు నూటికి నూరుపాళ్ళు వినోదం గ్యారెంటీ. దానికి నేను హామీ.
మీరు పెట్టిన ప్రతి పైసాకూ వినోదం అందిస్తూ, తెర పై ప్రతి మాటకూ, హీరో ప్రతి కదలికకూ, దర్శకుడి ప్రతి ఆలోచనకూ పగలబడి నవ్వుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపూ మీరు తెగ ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమా ఇంకా ఇలాగే ఉన్నందుకు తెగ నవ్వుకుంటారు. 150వ సినిమాగా కూడా ఇలాంటి సినిమా తీయగల దర్శకులు మన దగ్గరే ఉన్నందుకు ఏమనాలో తెలియక విషాదంగా నవ్వుతారు. ఈ చిత్రాలను అత్యద్భుత చిత్రాలుగా చెప్పుకు తిరుగుతున్న మన హీరోలనూ, దర్శక, నిర్మాతలనూ చూసి విరగబడి నవ్వుతారు. అందుకే, తప్పక చూడండి. ‘పరమ వీర చక్ర.’ ఆలస్యం చేయకండి. కొంపదీసి ఆలస్యం చేస్తే, మీరు చూద్దామన్నా హాలులో ఈ సినిమా ఉండదు....
(ఈ అర్ధరాత్రి ‘పరమ వీర చక్ర’లో మాకు కలిగిన మహదానందం గురించి రేపు తెల్లవారాక... నిద్ర లేచాక..తరువాతి పోస్టులో...)
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
5 వ్యాఖ్యలు:
అర్ధరాత్రి చాలా సాహసం చేసారే?
మీరన్నది నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా నిజం. ఈ సినిమా అయితే నేను చూడలేదు కానీ పలనాటి బ్రహ్మ నాయుడు సినిమాకి మా ఫ్రెండ్స్ అందరం వెళ్లి వీర లెవెల్లో ఎంజాయ్ చేయడం నాకు ఇంకా గుర్తుంది. ప్రతి సీన్ కి పడీ పడీ నవ్వాం. నా జీవితం లో మర్చిపోలేని కామెడీ సినిమాలో అదీ ఒకటి.
మీకసలు బొత్తిగా భయం లేకుండా పోతుందీ మధ్య! పండగ ముందు రోజు పరమ వీర చక్ర చూస్తారా? హన్నా!:-))
ఇది ఒక ఫుల్ లెంగ్థ్ కామెడి సినిమా కదండి బాబు!!!! ఇచ్హిన ప్రతి పైసా వసూలు ఐయినట్లె అండి మాస్టారూ!!!! కాని మీరు చెప్పినట్లు త్వరగా చూసెయాలి లెదంటె చూడటానికి సినిమా ఉండదు!!! హట్స్ హఫ్ !!! దాసరి ధి డిరెఖ్టొర్ మరియు బలక్రిష్న ధి నటుడు!!!!! నవ్వించి నవ్వించి చంపేసారు కదండీ!!!!!!
శంకర్ గారూ, అందులో చేయెత్తి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలునాపే సీను, చేయి ఊపగానే సింహాసనం బాలయ్య ముందుకు పరిగెత్తుకు రావడం భలే ఉద్వేగ భరితంగా ఉంటాయి కదండీ!
ఆ సినిమా తర్వాత "మీ పల్నాడోళ్ళ ప్రతాపం" అని మా ఇంట్లో చాలా రోజులు నన్ను ఆడుకున్నారు లెండి! అందుకే అంత తొందరగా మర్చిపోలేను ఆ సినిమాని
Post a Comment