జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, July 25, 2010

ఇదే నా మొదటి ప్రేమలేఖ

అందరికీ నమస్కారం.
రచన కొత్త కాకపోయినా బ్లాగ్ రచనలో నాకు ఇదే అన్నప్రాసన.
విశ్వాంతర వేదికపై కిటికీల ప్రపంచంలో నా అక్షరాన్ని ఆవిష్కరించే ప్రయత్నం.
ఇది వ్యక్తావ్యక్త అనుభూతుల ఆలాపన.
అంతరంగ ప్రేరణల ప్రేలాపన.
కొంచెం కారంగా, కొంత గారంగా, కావాల్సినంత తీయగా అన్నింటి కలబోత.
ఈ తిరగమోత సరిపోయిందో, చెడిపోయిందో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండే!!
ఇష్టపదిలోకి మీకు సాదర ఆహ్వానం.
అనుభూతులు కలబోసుకొని దూరంలోనూ దగ్గర అవుదాం.
మీ
రెంటాల జయదేవ

7 వ్యాఖ్యలు:

Kalpana Rentala said...

బ్లాగు లోకానికి స్వాగతం.

జ్యోతి said...

తెలుగు బ్లాగ్లోకానికి సుస్వాగతం.. ఆరంభించి వదిలేయకుండా తరచూ రాస్తుండాలి సుమా..

కొత్త పాళీ said...

స్వాగతం. తానా సావనీరులో తెలుగు సినిమా సాంకేతిక అభివృద్ధి గురించి మీర్రాసిన వ్యాసం చదివి చాలా ఇంప్రెసయాను. కొత్త పోస్టులకోసం ఎదురు చూస్తుంటాను.

Padmarpita said...

Welcome to blog......

Unknown said...

@ జ్యోతి గారు, మీ స్వాగతానికి కృతజ్ఞతలు. తరచూ రాయాలనే ప్రయత్నం. మీ సూచనను గుర్తుపెట్టుకుంటాను.
@ కల్పనా, థాంక్స్.
@ పద్మప్రియ గారు, మీ స్వాగతానికి కృతజ్ఞుణ్ణి.

Unknown said...

@ కొత్త పాళీ గారు,

నమస్తే. మీ స్వాగతానికి కృతజ్ఞతలు. చాలా రోజుల క్రితం నాటి తానా సావనీర్వ్యాసం మీ కు గుర్తు ఉన్నందుకు, అది మీ కు నచ్చినందు కు థాంక్స్. ఎప్పటికి అప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి.

Akbar said...

hi jayadeva garu
welcome
expecting more and more from your pen