జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 3, 2013

మీకు మీరే... మాకు మేమే...

- పరస్పరం కలసి రాని నాలుగు దక్షిణాది సినీ ఛాంబర్లు

చెన్నైలో జరుగుతున్న నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల సందర్భంగా, రెండో రోజున తెలుగు కార్యక్రమాలు జరిగాయి. కానీ, ఈ తెలుగు కార్యక్రమాలకు, దర్శకుడు కె. బాలచందర్‌, హీరో కమలహాసన్‌ మినహా తమిళ చిత్రసీమకు చెందిన ఇతర ప్రముఖులు కానీ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన తారలు కానీ ఎవరూ సభాంగణం వద్ద కనిపించనే లేదు. వెరసి, ఇది నాలుగు ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలూ కలసి చేసుకుంటున్న ఉత్సవాలుగా చెబుతున్నా, వ్యవహారం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైంది. కన్నడ చిత్ర సీమ ఫంక్షన్‌లోనూ, ఇతర సినీ పరిశ్రమల వారెవరూ లేక ఇదే సీన్‌ కనిపించింది. 


(ప్రజాశక్తి దినపత్రిక, 24 సెప్టెంబర్ 2013, మంగళ వారం, పేజీ నం. 8)

..............................................................

0 వ్యాఖ్యలు: