జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, October 10, 2013

ఒకటే జననం... ఒకటే మరణం

  ప్రముఖ నటుడు శ్రీహరి ఆకస్మిక మృతి


    -ముంబయిలో చికిత్స పొందుతూ కన్నుమూత 
    -కొద్దికాలంగా తీవ్రమైన కాలేయ వ్యాధి
   -తీవ్ర దిగ్భ్రాంతిలో తెలుగు చిత్ర పరిశ్రమ

   (హైదరాబాద్‌, ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి)

  ప్రముఖ సినీ నటుడు శ్రీహరి హఠాన్మరణం పాలయ్యారు. ముంబయ్ లోని లీలావతి ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన వయస్సు 49 సంవత్సరాలు. సినిమా రంగంలో 'రియల్‌ స్టార్‌'గా ప్రాచుర్యం పొందిన శ్రీహరి కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అత్యంత సన్నిహితులతో తప్ప, ఇతరులతో ఆయన ఈ సంగతి పంచుకోలేదు. దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం 'రాంబో రాజ్‌కుమార్‌' షూటింగ్‌ నిమిత్తం, అదే సమయంలో అక్కడ వైద్య చికిత్స కూడా చేయించుకొనేందుకు శ్రీహరి ముంబరు వెళ్ళినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అక్కడ చిత్ర షూటింగ్‌లో ఉండగానే ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారనీ, వెంటనే ఆసుపత్రికి తరలించారనీ తెలుస్తోంది. చికిత్స పొందుతూ, లీలావతి ఆసుపత్రిలోనే ఆయన కన్ను మూశారు. గురువారం బాచుపల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.


(ప్రజాశక్తి దినపత్రిక, 10 అక్టోబర్ 2013, గురువారం, పేజీ నం.1లో ప్రచురితం)
...............................................................

0 వ్యాఖ్యలు: