జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 18, 2013

పెదవి విప్పిన ప్రాంతీయ భాషలు


భారతీయ టాకీకి ఇప్పుడు శతవసంతాలు నిండాయి. ఈ నూరేళ్ళ పండుగ సందర్భంగా భారతదేశంలోని వివిధ భాషల్లో వచ్చిన తొలి టాకీ చిత్రాలు, వాటి విడుదల తేదీల వివరాలు ఏమిటంటే...
- తొలి భారతీయ టాకీ అర్దేషిర్ ఇరానీ దర్శకత్వంలో హిందీ - ఉర్దూ భాషల సమ్మేళనమైన హిందుస్థానీలో వచ్చిన 'ఆలమ్ ఆరా' (విడుదల: 1931 మార్చి 14)
- బెంగాలీలో అమర్‌ చౌధురి దర్శకత్వంలోని 'జమాయ్ షష్ఠి' (విడుదల: 1931 ఏప్రిల్‌ 11),
- తొలి దక్షిణ భారతీయ భాషా (తమిళ - తెలుగు) టాకీ హెచ్‌.ఎం. రెడ్డి 'కాళిదాస్‌' (1931 అక్టోబర్‌ 31)
- తొలి సంపూర్ణ తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' (1931 చివరలో నిర్మాణం మొదలై, 1932 ఫిబ్రవరి 6న విడుదల)
- మొట్టమొదటి పూర్తి తమిళ టాకీ 'హరిశ్చంద్ర' (1932 ఏప్రిల్‌ 9)
- మరాఠీలో వి. శాంతారామ్‌ దర్శకత్వంలో 'అయోధ్యా చే రాజా' (1932),
- గుజరాతీలో నానూబాయ్ వకీల్‌ దర్శకత్వంలో 'నరసింహ మెహతా' (1932),
- కన్నడంలో వై.వి. రావు దర్శకత్వంలో 'సతీ సులోచన' (1934 మార్చి 3),
- అస్సామీలో ప్రసాద్‌ అగర్వాల తీసిన 'జోరుమతి' (1935),
- ఒరియాలో మోహన్‌ గోస్వామి నిర్దేశకత్వంలోని 'సీతా బిబాహ' (1936),
- పంజాబీలో కె.డి. మెహ్రా తీసిన 'పిండ్‌ దీ కుడీ' (1936),
- మలయాళంలో ఎస్‌. నోట్టానీ దర్శకత్వంలో వచ్చిన 'బాలన్‌' (1938) చిత్రాలు ఆ యా భాషల్లో తొలి టాకీలు.
- ఇంగ్లీషులో వచ్చిన తొలి భారతీయ టాకీగా జె.ఎల్‌. ఫ్రీర్‌ దర్శకత్వంలోని 'కర్మ' (1933) ప్రత్యేకత సాధించింది.
.....................................................

0 వ్యాఖ్యలు: