మన ఆంధ్ర్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు సినిమాలకు ఏటేటా ఇచ్చే నంది అవార్డులు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడం కొత్తేమీ కాదు. 2009వ సంవత్సరానికి గాను ఈ మధ్యే ప్రకటించిన అవార్డులు కూడా అందుకు మినహాయింపు కాలేదు. మిగిలినవాటి మాటెలా ఉన్నా ఉత్తమ నటుడు అవార్డుకు దాసరి నారాయణరావు ('మేస్త్రీ' చిత్రం)ను ఎంపిక చేయడంపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
'మగధీర' చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచున్నా అందులోని హీరో రామ్ చరణ్ తేజ్ ను ఉత్తమ నటుడిగా తీర్మానించకుండా, ప్రత్యేక జ్యూరీ అవార్డుతో సరిపెట్టారేమిటని ఆ వర్గంలోని వారు నిలదీస్తున్నారు. దీని వెనుక దాసరి కుట్ర ఉందనేది వారి వాదన. దానిపై ఇప్పటికే మాటకు మాట సమాచార సాధనాల్లో వస్తూనే ఉంది.
ఇది ఇలా ఉండగా, గడచిన పక్షం రోజులుగా విదేశాల్లో ఉన్న పి.ఆర్.పి. అధ్యక్షుడు చిరంజీవి సొంతగడ్డకు తిరిగొచ్చారు. ఆయన వచ్చీరాగానే, సహజంగానే విలేఖరులు ఈ నంది అవార్డుల ప్రశ్న అడిగారు. దానికి చిరంజీవి మాత్రం చాలా కూల్ గా, జనరంజకత్వం కోసం 'మగధీర' చిత్రం తీశామనీ, ఆ చిత్రం తెలుగులో బాక్సాఫీసు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిందనీ పేర్కొన్నారు. నంది అవార్డు కన్నా ఈ ప్రజాదరణే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. త్వరలో నటించనున్న 150 వ చిత్రానికి తగ్గట్లుగా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళిన చిరంజీవి మొత్తానికి లౌక్యంగా జవాబిచ్చి తప్పించుకున్నారు.
అవార్డు ఎంపిక సరైనదే అని కానీ, కాదని కానీ నేను అదాటున ఓ నిర్ణయానికి వచ్చేయ దలుచుకోలేదు. తెర వెనుక ఏం జరిగిందన్నది తెలిస్తే కానీ, ఓ నిర్ణయానికి రాలేం. అయితే, ఒకటి మాత్రం నిజం. నా మటుకు నన్ను అడిగితే, 'మగధీర' జనాదరణ పొందిన చిత్రం. సాంకేతికంగా చక్కగా రూపొందించిన చిత్రం. అయితే, అన్ని రకాల సాంకేతిక విభాగాలకూ పేరు వచ్చి, సినిమాకు అవార్డులొచ్చినంత మాత్రాన అందులో నటించిన వ్యక్తి సైతం ఉత్తమ నటుడు కావాలని నియమం ఎక్కడైనా ఉందా. లేదు కదా.
పైగా, 'మగధీర'లో రామ్ చరణ్ తేజ్ నటన తొలి చిత్రం 'చిరుత' కన్నా మెరుగ్గా ఉందే తప్ప, ఉత్తమ నటుడికి సరిపడా మెరుగైందా అంటే ఆలోచించాల్సిందే. వివిధ విభాగాల కృషితో సినిమా ఉత్తమంగా నిలబడడం వేరు. ఉత్తమ నటన వేరు. ఆ రెంటినీ కలిపి చూస్తేనే కన్ ఫ్యూజన్. ఆ సంగతి మనవాళ్ళు గ్రహించాలి. లేదంటే, ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇలా అన్నంత మాత్రాన నేనేదో దాసరి "మేస్త్రీ" ఎంపికను ఏకపక్షంగా సమర్థిస్తున్నానని పొరపాటు పడకండి. ఏమైనా, ఇప్పటికి మాత్రం - కొవ్వు కరిగించుకొని, ఒళ్ళు తగ్గి వచ్చిన చిరు తన 150వ చిత్రంలో ఉత్తమ నటన చూపుతారేమో ఎదురుచూడాలి. అభిమానులమంతా దాని కోసమే నిరీక్షిస్తున్నాం.
డియర్ మేరీ
3 months ago
11 వ్యాఖ్యలు:
uttama natudi award "Rana" ku itchi vundavatchu... (again.. I am not playing any caste politics here..)
Question should be how in the world Dasari received the so called award, discussion should be centered around this rather than always targeting Chiru and his family. I resent people using words such as "kovvu" which I believe is derogatory.
-Sairam
"పైగా, మగధీరలో రామ్ చరణ్ తేజ్ నటన తొలి చిత్రం 'చిరుత' కన్నా మెరుగ్గా ఉందే తప్ప, ఉత్తమ నటుడికి సరిపడా మెరుగైందా అంటే ఆలోచించాల్సిందే."నేను మేస్త్రి చూడలేదు కనుక దాసరి గురించి మాట్లాడలేను.. మరొకటి, యేవో తొమ్మిది తొమ్మిది అవార్డులు వచ్చాయని ఉత్తమనటుడు కూడా మఘదీర కే ఇవ్వాలనడం కరక్టు కాదేమో..చిన్న చిత్రాలైనా అధ్బుతమైన నటన ప్రదర్శించిన వారు ఎందరో ఉన్నారు.
ప్రొడ్యూసర్లని ముంచడానికి తప్పితే చిరంజీవి కి ఇంకా సినిమాలు అవసరమా....?
అవార్డు జూరీ సభ్యులను ఎవరు ఎంతగా ప్రభావితం చేయగలిగితే వారే ఉత్తమ నటులని నా సొంత అన్భువం.తిరుపతిలోని ఒక హోటల్లో ,ఒక ప్రముఖ హాస్య +హీరో నేనే అక్కడ ఉండగానే,ఆయనకు మందు పార్టీ ఇస్తూ నాకు దొరికి పోయారు.అప్పట్లో నేను ఆంధ్రజ్యోతిలో కడప జిల్లా వార్తలు చూసేవాడిని[౧౯౯౦]
మీరు మేస్త్రీలో నటన చూసి ఇది వ్రాసినట్లు లేదు. నేనూ చూడలేదనుకోండి. ఆ సినిమా చూడకుండానే ఇద్దరి నటననూ మీరు ఎలా పోల్చుతారో నాకు అర్ధం కావడం లేదు. దాసరి సీనియర్ నటుడు కాబట్టి ఎలాగయినా బాగా నటించేస్తాడని మీ ఉద్దేశ్యమా?
దాసరి ఎలా నటించాడు అన్నదానికన్నా మగధీరకి గానూ రాం చరణ్ కి ఉత్తమ అవార్డ్ ఇస్తే మాత్రం నేనస్సలు జీర్ణించుకోలేను. మగధీర సెకండ్ ఆఫ్ లో రాం చరన్ డైలాగ్ డెలివరీ చాలా దరిద్రంగా ఉంటుంది. నటన "ఉత్తమ" అన్నదానికి చాలాదూరంలో ఉంది.
‘నంది’లో మోసం జరిగిందా ? అవును
‘మగధీర’లోది ఉత్తమ నటనేనా ? కాదు
కానీ దాసరి, తీర్థల కన్నా better choices వున్నాయి.
Ya i agree with Badri.
దాసరికన్నా సొంతఊరు లో యల్.బి.శ్రీరాం. అర్హుడని ఎక్కడో చదివాను. నేను మేస్త్రీ చూడలేదు కాబట్టి వ్యాఖ్యానించలేను కానీ దాసరిగారి మెజారిటీ సినిమాలను దృష్టిలో పెట్టుకు ఆలోచిస్తే మాత్రం మోసం జరిగిందనే అనిపిస్తుంది.
ఇలాంటి టాపిక్ గురించి రాయటమేంటండి మీరు కూడా మరీనూ!! తమ్మళ్లు, కొడుకులు, కొడుకుల కొడుకులు హీరొలుగా ఉండి, బ్రష్టుపట్టిపోయిన తెలుగు సినిమాలు.. మళ్ళీ వాటిలో ఎవడిది ఉత్తమ నటన?
Post a Comment