జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 31, 2010

భయపెట్టిన ‘బావ’ఈ మధ్య మనవాళ్ళు ఎలాంటి సినిమాలు తీస్తున్నారంటే హాలుకు వెళ్ళాలంటే భయమేస్తోంది. అయినా సరే, తెలుగు సినిమా విడుదలైతే, మనసు ఊరుకోదు. దాంతో, ఖర్చు, శ్రమ పక్కనబెట్టి, పట్టువదలని విక్రమార్కుడిలా హాలు దారి పట్టక తప్పడం లేదు.

గడచిన వారం, పది రోజుల పైగా రకరకాల కారణాలతో తెగని పనుల్లో తెగ మునిగిపోవడంతో ఈ వారాంతం ఎలాగైనా సినిమాకు చెక్కేయాలనుకున్నా. దానికి తోడు పక్షం రోజుల తరువాత ఊళ్ళోకి కొత్త తెలుగు సినిమా వచ్చి, ఊరించింది. రెండు రోజులుగా కురుస్తున్న వానల మధ్యలోనే మనసు విహంగం రెక్కలు విప్పుకొని, హాలు ముంగిట వాలింది.

కానీ, సిద్ధార్థ నటించిన ‘బావ’ ఉన్న ఉత్సాహాన్ని కూడా హరించేసింది. నిలువునా నీరసం తెప్పించేసింది. సగటు తెలుగు సినిమా ఇక మారదేమోననే నిరాశ వైపు నన్ను మరో అడుగు ముందుకు నెట్టేసింది. కష్టపడి నిద్ర ఆపుకొని ఈ మూడుముక్కల టపా రాస్తున్నా... కనీసం రేపు ఆదివారం పొద్దున్నే నా లాగా మరెందరో తెలుగు సినిమా పిచ్చోళ్ళు ఈ సినిమాకు బకరాలుగా దొరికిపోకూడదని.

(రేపు నిద్ర లేచాక, ఓపిక చేసుకొని మిగతా కథ చెబుతాను మిత్రులారా....)

3 వ్యాఖ్యలు: